వికారాబాద్‌ జిల్లాలో జోరుగా కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-05-21T09:01:39+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో

వికారాబాద్‌ జిల్లాలో జోరుగా కొనుగోళ్లు

ఇప్పటివరకు 28 వేల టన్నుల ధాన్యం సేకరణ


పరిగి: వికారాబాద్‌ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో రైతులు ఎక్కడివారు అక్కడే విక్రయించుకుంటున్నారు. గ్రామాల వారీగా ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకురావాల్సిన తేదీలను రైతులకు ముందుగానే సూచిస్తుండడంతో ఇబ్బందులు లేకుండా అమ్ముకుంటున్నారు. జిల్లాలో యాసంగిలో 20 వేల ఎకరాల్లో వరి సాగైందని అంచనా. అయితే ఈసారి 40 వేల టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు  అంచనా వేశారు.


ఇప్పటి వరకు 28 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలోని 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8,136 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వారికి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. జిల్లాలో రూ.73 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.50 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సందడితో కనిపిస్తున్నారు. జిల్లాలో మరో వారం, పదిరోజులపాటు కొనుగోళ్లు జరగనున్నాయి


ప్రతి గింజను కొంటాం.. లక్ష్మణ్‌, సివిల్‌ సప్లై మార్కెటింగ్‌ అధికారి  20పిఆర్‌జి11

రైతు పండించిన ప్రతి గింజను కొంటాం. జిల్లాలోని 18 మండలాల్లో 206 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో ప్రస్తుతం జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 28  వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. గన్నీబ్యాగ్‌ల కొరత కూడా లేదు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మరో వారం, పది రోజుల వరకు వరిధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి.

Updated Date - 2020-05-21T09:01:39+05:30 IST