రూ.వెయ్యి కోసం యువకుడిపై యాసిడ్‌ దాడి

ABN , First Publish Date - 2022-05-19T06:33:48+05:30 IST

సెల్‌ఫోన్‌ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొ డవతో యువకుడిపై రాడ్‌తో దాడిచేసి యాసిడ్‌పోసి పరారైన ఘటన బుధవారం ఆరోటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. దొంగిలించిన సె ల్‌ఫోన్‌ను కొన్న యువకుడు ఆ విషయం తెలియడంతో దానిని తిరిగి ఇ వ్వాలని తాను ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలని కోరడంతో ఆ యువకుడి ప్రా ణాలమీదకు వచ్చింది. నగరంలోని బాబన్‌సాపహాడ్‌కు చెందిన షేక్‌ కలీం అనే యువకుడు కూలీ పనిచేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. అతడికి దొడ్డి కొమురయ్య కాలనికి చెందిన రంజాని అనే యువకుడు స్నేహితుడుగా ఉన్నాడు. రంజానికి కొజాకాలనీకి చెందిన ఫారుక్‌, మతిన్‌ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి తరచు చిల్లర దొంగతనాలు, సెల్‌ఫోన్‌లు దొంగిలిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు దొంగలించిన సెల్‌ఫోన్‌ను 4500లకు విక్రయించారు. ఆ సెల్‌ఫోన్‌ కొన్న యువకుడు వినియోగించడానికి భయపడి తిరిగి కొనుగోలు చేసిన వారికే ఇచ్చేశాడు. వారు 3500 రూపాయలు తిరిగి ఇచ్చి వెయ్యి రూపాయలు తర్వాత ఇస్తామన్నారు. ఆ వెయ్యి రూపాయలు ఇవ్వాలని అడగగా కలీంను చితకబాదారు. అనంతరం వాహనాల బ్యాటరీలో వాడే యాసిడ్‌పోసి పరారయయ్యారు. ఈ ఘటనలో కలీం వీపు మొత్తం కాలిపోయింది. బ

రూ.వెయ్యి కోసం యువకుడిపై యాసిడ్‌ దాడి

ఖిల్లా, మే 18: సెల్‌ఫోన్‌ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొ డవతో యువకుడిపై రాడ్‌తో దాడిచేసి యాసిడ్‌పోసి పరారైన ఘటన బుధవారం ఆరోటౌన్‌  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. దొంగిలించిన సె ల్‌ఫోన్‌ను కొన్న యువకుడు ఆ విషయం తెలియడంతో దానిని తిరిగి ఇ వ్వాలని తాను ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలని కోరడంతో ఆ యువకుడి ప్రా ణాలమీదకు వచ్చింది. నగరంలోని బాబన్‌సాపహాడ్‌కు చెందిన షేక్‌ కలీం అనే యువకుడు కూలీ పనిచేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. అతడికి దొడ్డి కొమురయ్య కాలనికి చెందిన రంజాని అనే యువకుడు స్నేహితుడుగా ఉన్నాడు. రంజానికి కొజాకాలనీకి చెందిన ఫారుక్‌, మతిన్‌ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి తరచు చిల్లర దొంగతనాలు, సెల్‌ఫోన్‌లు దొంగిలిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు దొంగలించిన సెల్‌ఫోన్‌ను 4500లకు విక్రయించారు. ఆ సెల్‌ఫోన్‌ కొన్న యువకుడు వినియోగించడానికి భయపడి తిరిగి కొనుగోలు చేసిన వారికే ఇచ్చేశాడు. వారు 3500 రూపాయలు తిరిగి ఇచ్చి వెయ్యి రూపాయలు తర్వాత ఇస్తామన్నారు. ఆ వెయ్యి రూపాయలు ఇవ్వాలని అడగగా కలీంను చితకబాదారు. అనంతరం వాహనాల బ్యాటరీలో వాడే యాసిడ్‌పోసి పరారయయ్యారు. ఈ ఘటనలో కలీం వీపు మొత్తం కాలిపోయింది. బాదితుడు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ జ నరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాదితుడి కుటుంబ సభ్యులు 6వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ విషయమై సౌత్‌ రూరల్‌ సీఐ నరేష్‌కు కేసు విషయం సంప్రదించగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని తమ పరిధికి రాదని తమ పరిదిలో ఉంటే కేసు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-19T06:33:48+05:30 IST