Abn logo
Aug 28 2021 @ 12:41PM

మతమార్పిడుల కోసం విదేశాల నుంచి రూ. 60 కోట్ల నిధులు

వడోదర (గుజరాత్): మత మార్పిడులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కోసం విదేశాల నుంచి హవాలా ద్వారా భారతదేశంలోని నిందితులకు డబ్బు వచ్చిందని వడోదర పోలీసు కమిషనర్ షంషేర్ సింగ్ తెలిపారు. మత మార్పిడులు చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలిపేందుకు విదేశాల నుంచి నిందితులకు రూ.60 కోట్లు వచ్చాయని పోలీసు కమిషనర్ చెప్పారు. గత ఐదేళ్లలో నిందితులకు విదేశాల నుంచి 60కోట్ల రూపాయలు వచ్చాయని పోలీసులు వివరించారు. 

మతమార్పిడులు చేసేవారు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలిపే వారికి దుబాయ్, యూకే, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ల నుంచి విరాళాల ద్వారా విరాళాలు వచ్చాయని పోలీసు కమిషనర్ చెప్పారు. హవాలా నిధుల కేసులో నిందితులు సలావుద్దీన్ షేక్, మహ్మద్ ఉమర్ గౌతమ్‌లను గుర్తించామని  కమిషనర్  చెప్పారు.సెప్టెంబర్ 3 వతేదీని నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.