అచ్చన్నాయుడుతో మాట్లాడుతున్న ఇంటూరి రాజేష్
కందుకూరు, మే 26: టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ గురువారం మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.