Abn logo
Jan 25 2021 @ 01:00AM

వాహనదారుల అప్రమత్తతతో ప్రమాదాల నివారణ

బోథ్‌రూరల్‌, జనవరి 24: వాహనదారుల అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి శ్రీనివాస్‌ అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని సోనాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ను ధరించి, ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు అధికారి శ్రీనివాస్‌, రవాణా శాఖ అధికారులు హరింద్రకుమార్‌, సంతోష్‌రెడ్డి, సీఐ ముదావత్‌నైలు, ఎస్సై రాజు, ఎంపీపీ తుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement