ఊపందుకున్న పప్పుశనగ విత్తన సాగు

ABN , First Publish Date - 2021-10-19T06:08:55+05:30 IST

మండలంలోని పలు గ్రామాల నల్లరేగడి భూముల్లో పప్పు శనగ సాగు ఊపందుకుంది. అదునులో పదును వర్షం కావడంతో కొండంత ఆశతో సాగు కు సిద్ధమవుతున్నారు.

ఊపందుకున్న పప్పుశనగ విత్తన సాగు
ఎర్రగుడిలో ట్రాక్టర్‌తో పప్పుశనగ విత్తనం వేస్తున్న రైతులు

బెళుగుప్ప, అక్టోబరు 18: మండలంలోని పలు గ్రామాల నల్లరేగడి భూముల్లో పప్పు శనగ సాగు ఊపందుకుంది. అదునులో పదును వర్షం కావడంతో కొండంత ఆశతో సాగు కు సిద్ధమవుతున్నారు. మండలవ్యాప్తంగా 16 వేల ఎకరాలకు పైగా విత్తనం సాగు చేయనున్నారు. తగ్గుపర్తి, ఎర్రగుడి, దుద్దేకుంట, వెంకటాద్రిపల్లి, శీర్పి, బెళుగుప్ప, గంగవరం, ఆ వులెన్న, అంకంపల్లిలో పప్పుశనగను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఆయా గ్రామాల్లో రైతులు విత్తన సాగులో బిజీగా ఉన్నారు.


Updated Date - 2021-10-19T06:08:55+05:30 IST