Abn logo
May 17 2021 @ 23:45PM

నిర్వాసితుల స్థలాల్లో పనులు వేగవంతం

అభివృద్ధి చేస్తున్న స్థలాలను పరిశీలిస్తున్న జేసీ కిషోర్‌కుమార్‌

జేసీ కిషోర్‌కుమార్‌

భోగాపురం, మే17: ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద కేటాయిస్తున్న స్థలాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. గూడెపువలస సమీపంలో చదును చేస్తున్న స్థలాలను ఆయన సోమవారం పరిశీలించారు. రహదారులు, కాలువలు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. వీలైనంత తొందరగా స్థలాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఆయన వెంట ఇన్‌చార్జి తహసీల్దార్‌ డి.గాంధీ, ఎంపీడీవో బంగారయ్య, ఆర్‌ఐ రవి, వీఆర్వోలు ఉన్నారు.


Advertisement