Abn logo
Apr 11 2021 @ 01:23AM

భారత వ్యాపారవేత్తకు అబుధాబి పౌరపురస్కారం

దుబాయ్‌, ఏప్రిల్‌ 10: భారత సంతతికి చెందిన వ్యాపారదిగ్గజం యూస్‌ఫఅలీ ఎంఏ, మరో 11 మంది అందించిన సేవలకు గుర్తింపుగా అబుధాబిలోని అత్యున్నత పౌరపురస్కారంతో ఆ దేశ యువరాజు షేక్‌ మహమద్‌ బీన్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్‌ శుక్రవారం సత్కరించారు. అబుధాబి కేంద్రంగా అనేక దేశాలలో రిటైల్‌ కంపెనీలు నిర్వహిస్తున్న లులూ గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూస్‌ఫఅలీ కేరళలో జన్మించారు. యూఏఈని శక్తివంతం చేస్తున్న 12 మంది గొప్ప వ్యక్తులను ఈరోజు సత్కరించుకున్నామని యువరాజు అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement