Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓసీడీని వదిలించుకోవచ్చు!

ఆంధ్రజ్యోతి(17-11-2020)

కరోనా సోకకుండా చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం అవసరమే! అయితే సూక్ష్మక్రిములు సోకుతాయేమోననే విపరీతమైన భయం కొందరిలో అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఒ.సి.డి)కు దారితీసే వీలు ఉంది. ఈ పరిస్థితి దైనందిన జీవితానికి ఇబ్బందిని కలిగిస్తుంటే అప్రమత్తకరోనా సోకకుండా చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం అవసరమే! అయితే సూక్ష్మక్రిములు సోకుతాయేమోననే విపరీతమైన భయం కొందరిలో అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఒ.సి.డి)కు దారితీసే వీలు ఉంది. ఈ పరిస్థితి దైనందిన జీవితానికి ఇబ్బందిని కలిగిస్తుంటే అప్రమత్తమై వైద్యులను సంప్రతించాలి. చేతులు శుభ్రం పాటించడంతో పాటు ఓసీడీ కలిగిన వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు లక్షణాలూ ఉంటాయి.


సూక్ష్మక్రిములు అంటుకున్నాయనే భయంతో చేతులు పాచిపోయేవరకూ పదే పదే కడుగుతూనే ఉండటం

వస్తువులన్నీ పద్ధతి ప్రకారం ఉండాలని బలంగా కోరుకోవటం, వాటి క్రమంలో ఏమాత్రం తేడా చోటుచేసుకున్నా విపరీతమైన భావోద్వేగానికి లోనవడం

తనని తాను, లేదా ఇతరులకు హాని తలపడతానేమోననే విపరీతమైన భయం కలిగిఉండడం

తలుపు తాళం వేశానా లేదా? స్టవ్‌ మంట తీశానా లేదా? అని పదే పదే చెక్‌ చేసుకుంటూ ఉండడం

అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌కు జన్యుపరమైన, పర్యావరణపరమైన అంశాలే కారణం. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తిస్తే, సమర్ధమైన చికిత్సతో పూర్తిగా నయం చేసుకోవచ్చు.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...