దళిత మహిళలపై దాడుల గురించి చెంగల ఎందుకు స్పందించలేదు

ABN , First Publish Date - 2022-06-29T06:09:21+05:30 IST

రాష్ట్రంలో మూడేళ్ల నుంచి దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ఇప్పటి వరకు ఎక్కడ దాక్కున్నావని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావును తెలుగు మహిళా అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు ప్రశ్నించారు.

దళిత మహిళలపై దాడుల గురించి  చెంగల ఎందుకు స్పందించలేదు
ఆడారి మంజు


తెలుగు మహిళా అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు 

వంగలపూడి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ 

మునగపాక, జూన్‌ 28: రాష్ట్రంలో మూడేళ్ల నుంచి దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ఇప్పటి వరకు ఎక్కడ దాక్కున్నావని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావును తెలుగు మహిళా అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు ప్రశ్నించారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, వైసీపీ పాలనలో సాటి దళితులకు తీవ్రఅన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత చెంగలకు లేదా అని ప్రశ్నించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన చెంగల వెంకటరావు ఆమెకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తెలుగు మహిళలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. దళిత మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా.. అనిత వెంటనే స్పందిస్తూ బాధితులకు అండగా నిలబడి పోరాడుతున్నారని ఆమె అన్నారు. వైసీపీ నాయకులకు మహిళలు అంటే గౌరవం లేదని అందుకే అంత తేలిగ్గా మాట్లాడుతున్నారన్నారు.


Updated Date - 2022-06-29T06:09:21+05:30 IST