Abn logo

కొల్హాపురి మటన్‌

కావలసినవి: మటన్‌- అరకిలో, టొమాటో ముక్కలు- ఒకటి, ఉల్లిపాయ తరిగినది- ఒకటి, కొబ్బరి తురిమినది - అరచిప్ప, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్‌లు, మిరియాలు- నాలుగు లేక ఐదు
గసగసాలు - రెండు టీ స్పూన్‌లు, ధనియాలు- రెండు టీ స్పూన్‌లు, పసుపు- ఒక టీ స్పూన్‌, గరమ్‌ మసాల పొడి- ఒక టీ స్పూన్‌, నూనె తగినంత.
తయారీ విధానం:
మటన్‌ని కడిగి శుభ్రం చేసి నీరు ఇగిరి పొడిగా అయిందాకా ఉడికించండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి , టొమాటో ముక్కలు, మిరియాలు, ధనియాలు మెత్తగా రుబ్బి పెట్టుకోండి. మూకుడులో నూనె వేడి చేసి మసాలా వేసి 7 లేక 8 నిమిషాలు నూనె తేలిందాకా వేగించండి. తర్వాత ఉడికించిన మటన్‌ని వేసి మసాల దానికి బాగా పట్టేలా కలియబెట్టండి. తరువాత తురిమిన కొబ్బరి వేసి మటన్‌ మసాలాని పూర్తిగా పీల్చుకునే దాకా ఉడికించండి. ఒకవేళ బాగా పొడిగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా నీరు చిలకరించండి. పూర్తిగా ఉడికిన తరువాత తీసి పరాఠాలతో కానీ చపాతీతోగానీ వడ్డించండి. దాదాపు మన మటన్‌ ఇగురు కూరే ఇది.


రైతు బజార్‌ను మూయించిన కలెక్టర్‌

గిరిజన బాలుడి అదృశ్యం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బంద్‌

‘లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి’

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

కొనసాగుతున్న కరోనా బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా

ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి

యువకుడిని రిమ్స్‌కు తరలించిన అధికారులు

గ్రామాలకు దారులు బంద్‌
Advertisement
d_article_rhs_ad_1

నవ్య