Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రాన్‌ పత్తా బిరియాని

ప్రాన్‌ పత్తా బిరియాని

an style="color: red;">కావలసిన పదార్థాలు: రొయ్యలు - 400గ్రా, పొల్లిచ మసాలా - 400గ్రా, వండిన పులావ్‌ రైస్‌ - 800గ్రా, అరటి ఆకులు - 4, టైగర్‌ రొయ్యలు - 400గ్రా, కారం - 10గ్రా, పసుపు - 5గ్రా  ఉప్పు - 10గ్రా, నిమ్మరసం - 3 నిమ్మకాయలు, కరివేపాకు - 5గ్రా, ఉల్లి తరుగు - 80గ్రా, పికిల్‌ - 40గ్రా, అప్పడాలు - 4, పొల్లిచ మసాలా: కొబ్బరి నూనె - 100గ్రా, ఆవాలు - 10గ్రా మెంతులు - 5గ్రా, వెల్లుల్లి తరుగు - 25గ్రా, అల్లం తరుగు - 20గ్రా, పచ్చిమిర్చి - 10గ్రా ,కరివేపాకు - 5గ్రా, ఉల్లి ముక్కలు - 1 కిలో ,టొమాటో పేస్ట్‌ - 400గ్రా, ఉప్పు - 10గ్రా కుంకుమ పువ్వు - 15గ్రా, పసుపు - 5గ్రా, కశ్మీరీ కారం - 15గ్రా, ధనియాల పొడి - 20గ్రా, ఫిష్‌ స్టాక్‌ - 150గ్రా

తయారీ విధానం: నూనె వేడిచేసి ఆవాలు, అల్లం, వెల్లుల్లి తరుగు, కారం, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత మసాలాలు వేసి టొమాటో పేస్ట్‌, ఫిష్‌ స్టాక్‌ కూడా వేసి కలపాలి. నూనె తేలేవరకూ ఉడికించి ఉప్పు, కుంకుమ పువ్వు వేసి దింపాలి. చిన్న రొయ్యలకు పొల్లిచ మసాలా కలిపి పక్కనుంచాలి. కారం, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, నిమ్మరసంలో టైగర్‌ ప్రాన్స్‌ను నానబెట్టుకోవాలి. అరటి ఆకులో ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న రొయ్యలు, వాటిపైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులావ్‌, టైగర్‌ ప్రాన్స్‌ లేయర్స్‌గా పరచాలి. తర్వాత అరటి ఆకును నాలుగువైపుల్నుంచీ మడిచి గ్రిల్‌ మీద కాల్చాలి. అరటి ఆకు నల్లగా తయారై ఆకు వాసన రొయ్యలకు పట్టేంతవరకూ గ్రిల్‌ చేయాలి. పికిల్‌, అప్పడాలతో వేడివేడిగా తినేయాలి.

హరితహారాన్ని విజయవంతం చేయాలిహరితహారాన్ని విజయవంతం చేయాలిపేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం ధ్యేయంపేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం ధ్యేయంకార్పొరేట్‌స్థాయిలో సర్కారు దవాఖానాకార్పొరేట్‌స్థాయిలో సర్కారు దవాఖానామాటల యుద్ధం!మాటల యుద్ధం!ఆసిఫాబాద్‌లో బీజేపీలో కొత్త జోష్‌ఆసిఫాబాద్‌లో బీజేపీలో కొత్త జోష్‌సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలిసింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలిబాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందిటీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందిసీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలిసీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలిఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నంఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.