Abn logo

సేమియా చికెన్‌ బిర్యానీ

కావలసిన పదార్థాలు : సేమియా-అర కేజి, నిమ్మకాయ-1, చికెన్‌-అర కేజి, పచ్చిమిర్చి-10గ్రా, దాల్చిన చెక్క-1, లవంగాలు-6, ఉల్లిపాయలు-2, నూనె-తగినంత, కొత్తిమీర-6 రెబ్బలు, అల్లంవెల్లుల్లి ముద్ద-20గ్రా, ఉప్పు-తగినంత, బిర్యానీ ఆకు-10గ్రా, యాలకులు-2, జీడిపప్పు-200గ్రా, పసుపు-చిటికెడు.
తయారుచేయు విధానం : ముందుగా స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలి. అందులో సేమియా వేసి, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను నూనె వేసి అయిదు నిమిషాలు ఉంచి దించేయాలి. తడి బట్ట తీసుకుని ఉడికిన సేమియాను అందులో వేసి వడగట్టాలి. నీరంతా పోయిన తర్వాత సేమియాను ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్‌పై మరో గిన్నె ఉంచి, కొద్దిగా నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్‌ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉడికించాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు అన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి చికెన్‌పై చల్లి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి. చిన్న మంటపై మరో అయిదు నిమిషాలు చికెన్‌ను ఉడికించి, ఆపైన సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే- సేమియా చికెన్‌ బిర్యానీ రెడీ అయినట్లే.

పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌చిన్నారివైద్యానికి సీఎం సహాయనిధి అభివృద్ధి పనులను గడువు లోగా పూర్తి చేయాలికుస్లి కూడలిలో ఇసుక టిప్పర్‌ పట్టివేతమొక్కజొన్నలకు భారీ డిమాండ్‌కరోనాలెక్కలను దాచేస్తున్నారు జిల్లాలో కొవిడ్‌ పరిస్థితులపై గవర్నర్‌ ఆరాగిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిదండారీని కేంద్రం గుర్తించిందిపేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌
Advertisement
Advertisement