వర్జిన్ సాండ్రియా

ABN , First Publish Date - 2017-03-11T20:27:15+05:30 IST

కావలసిన పదార్థాలు నల్ల ద్రాక్ష- మూడు కప్పులు, దానిమ్మ గింజలు- ఒక కప్పు, బత్తాయి రసం- ఒక కప్పు

వర్జిన్ సాండ్రియా

కావలసిన పదార్థాలు
నల్ల ద్రాక్ష- మూడు కప్పులు, దానిమ్మ గింజలు- ఒక కప్పు, బత్తాయి రసం- ఒక కప్పు, నిమ్మరసం- ఒక టేబుల్‌ స్పూను, చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు, యాపిల్‌- ఒకటి, నిమ్మకాయ- ఒకటి, తాగే సోడా- 200 ఎం.ఎల్‌.
 
తయారీ విధానం
నల్ల ద్రాక్ష, దానిమ్మ గింజలను మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకోవాలి. తర్వాత బత్తాయి రసం, నిమ్మరసం, చక్కెర వేసి బాగా కలపాలి. సర్వ్‌ చేసే ముందు కొన్ని నిమ్మకాయ, యాపిల్‌ ముక్కల్ని వేసుకోవడంతో పాటు తాగే సోడాను కూడా కలపాలి.

Updated Date - 2017-03-11T20:27:15+05:30 IST