వెజిటబుల్‌ విత్ పాస్తా సలాడ్‌

ABN , First Publish Date - 2016-12-31T14:07:42+05:30 IST

క్యాప్సికమ్‌ - 20 గ్రాములు, బ్రకోలి, జుకుని - ఒక్కోటి 05గ్రాముల చొప్పున, సలాడ్‌ ఆయిల్‌ - పది మిల్లిలీటర్లు, నిమ్మకాయ

వెజిటబుల్‌ విత్ పాస్తా సలాడ్‌

కావలసినవి: క్యాప్సికమ్‌ - 20 గ్రాములు, బ్రకోలి, జుకుని - ఒక్కోటి 05గ్రాముల చొప్పున, సలాడ్‌ ఆయిల్‌ - పది మిల్లిలీటర్లు, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - చిటికెడు, వెల్లుల్లి(తరిగి) - 02 గ్రాములు, పాస్తా (ఉడికించి ) - వందగ్రాములు, పార్స్లీ,
వెనిగర్‌ - కొద్దిగా.

తయారీ: కూరగాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి. ఒక గిన్నెలో ఉడికించిన పాస్తా, కూరగాయ ముక్కల్ని వేయాలి. వెల్లుల్లి తరుగు, ఉప్పు, సలాడ్‌ నూనె, వెనగిర్‌ వేసి బాగా కలపాలి. పార్స్లీతో అలంకరించాలి.

Updated Date - 2016-12-31T14:07:42+05:30 IST