స్పైసీ వాటర్‌ మెలన్‌ సోడా

ABN , First Publish Date - 2018-04-22T00:01:33+05:30 IST

పంచదార - 1/2 కప్పు, నీళ్లు - 1/2 కప్పు, పచ్చిమిరపకాయ - 1, పుచ్చకాయ ముక్కలు - 5 కప్పులు

స్పైసీ వాటర్‌ మెలన్‌ సోడా

కావలసిన పదార్థాలు
 
పంచదార - 1/2 కప్పు, నీళ్లు - 1/2 కప్పు, పచ్చిమిరపకాయ - 1, పుచ్చకాయ ముక్కలు - 5 కప్పులు, నిమ్మకాయ - 1, సోడా - 2 కప్పులు.
 
తయారుచేసే విధానం
 
పాన్లో పంచదార, నీళ్లు కలిపి వేడిచెయ్యండి. పంచదార పూర్తిగా కరిగాక, దించేసి పచ్చిమిర్చి తరుగు కలిపి పక్కనుంచండి. గంట తర్వాత వడకట్టి సిరప్‌ను ఫ్రిజ్‌లో పెట్టండి. ఇప్పుడు గింజలు తీసిన పుచ్చకాయ ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్‌ చెయ్యండి. దీనికి నిమ్మరసం చేర్చి వడకట్టండి. ఈ జ్యూస్‌ను జార్లో పోసి, దానికి ఐస్‌ క్యూబ్స్‌, సోడా, పావు కప్పు సిరప్‌ కలిపి గ్లాసుల్లో సర్వ్‌ చెయ్యండి. దీన్ని చల్లగా వెంటనే తాగితే బాగుంటుంది.

Updated Date - 2018-04-22T00:01:33+05:30 IST