Abn logo

పచ్చి బఠాణి పరాటాలు

కావలసిన పదార్థాలు: పచ్చిబఠాణి - 1 కప్పు, పచ్చిమిర్చి - 3, అల్లం - 2 అంగుళాల ముక్క, గరం మసాల - ముప్పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, వాము / జీలకర్ర - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, గోధుమపిండి - ఒకటింబావు కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, నూనె కలిపి తగినంత నీటితో ముద్దలా చేసుకొని అరగంట పక్కనుంచాలి. ఒక గిన్నెలో బఠాణి, చిటికెడు పంచదార కలిపి కుక్కర్లో (జున్ను తయారీలా) ఉడికించాలి. చల్లారిన తర్వాత అల్లం, పచ్చిమిర్చిలతో పాటు బరకగా రుబ్బుకొని, ఉప్పు, మసాల పొడి, పసుపు, వాము/జీలకర్ర, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పిండిని పూరీల్లా వత్తి, మఽధ్యలో బఠాణి మిశ్రమం పెట్టి మడచి (మరీ పలచగా వత్తితే లోపలి మిశ్రమం బయటకి వస్తుంది కాబట్టి) కొద్దిగా దళసరిగా పరాటాలు చేసుకొని నెయ్యితో పెనంపై దోరగా కాల్చుకోవాలి. ఈ పరాటాలకు పెరుగు చట్నీ మంచి కాంబినేషన్‌.  

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement