రాగి జావ

ABN , First Publish Date - 2018-03-10T19:57:33+05:30 IST

రాగి పిండి - 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం పొడి - 3 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - 1 కప్పు, పాలు - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు..

రాగి జావ

కావలసిన పదార్థాలు
 
రాగి పిండి - 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం పొడి - 3 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - 1 కప్పు
పాలు - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు
 
తయారీవిధానం
 
రాగి పిండి, బెల్లం ఓ గిన్నెలో వేసి కప్పు నీళ్లు పోయాలి. తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. గిన్నెను చిన్న మంట మీద వేడి చేయాలి. ఉడుకుతున్నంతసేపూ గరిటతో కలుపుతూ ఉండాలి. లేదంటే పిండి ఉండలుకడుతుంది. రెండు నిమిషాలపాటు ఉడికించి, చివర్లో యాలకుల పొడి కలపాలి. తర్వాత గ్లాసులో పోసి సర్వ్‌ చేయాలి. తీపి ఇష్టం లేని వాళ్లు ఉప్పు కలుపుకుని తాగొచ్చు. పాలకు బదులుగా మజ్జిగ కూడా కలుపుకుని తాగొచ్చు. కాకపోతే రాగి పిండిని నీళ్లలో కలిపి ఉడికించి, చల్లారిన తర్వాతే మజ్జిగ కలుపుకోవాలి.

Updated Date - 2018-03-10T19:57:33+05:30 IST