కొత్తిమీర సూప్‌

ABN , First Publish Date - 2015-08-30T23:25:21+05:30 IST

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు - ఒకటిన్నర కప్పులు, బటర్‌ - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, దాల్చిన చెక్క

కొత్తిమీర సూప్‌

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు - ఒకటిన్నర కప్పులు, బటర్‌ - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, (తొక్క తీసిన) బంగాళదుంప క్యూబ్స్‌ - ముప్పావు కప్పు, పాలు - అరకప్పు, నీరు లేదా వెజిటెబుల్‌ స్టాక్‌ - రెండున్నర కప్పులు.
తయారుచేసే విధానం: కడాయిలో బటర్‌ కరిగించి బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, బంగాళ దుంప ముక్కలు వేసి 5 నిమిషాలు వేగించాలి. తర్వాత కొత్తిమీర తరుగు కలిపి మంట తగ్గించి పాలు పోయాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు నీరు లేదా (ఉంటే) వెజిటెబుల్‌ స్టాక్‌లో ఈ కొత్తిమీర పేస్టు వేసి 3 పొంగులు వచ్చేవరకు మరిగించాలి. తాగేటపుడు వేగించిన బ్రెడ్‌ ముక్కలు వేసుకుని వేడి వేడిగా తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-30T23:25:21+05:30 IST