కోవా సేమ్యా పాయసం

ABN , First Publish Date - 2015-09-02T20:29:08+05:30 IST

కావలసినవి : సేమ్యా - 400గ్రా, పంచదార - 400గ్రా, నెయ్యి - 150గ్రా, పాలు - 400 మి. లీ,

కోవా సేమ్యా పాయసం

కావలసినవి : సేమ్యా - 400గ్రా, పంచదార - 400గ్రా, నెయ్యి - 150గ్రా, పాలు - 400 మి. లీ, కుంకుమ పువ్వు - అర టీ స్పూన్‌
అలంకరణకి, కోవా - 200 గ్రాములు, పిస్తా (ముక్కలుగా తరిగినవి) - 10 గ్రాములు, బాదం పప్పు (ముక్కలుగా తరిగినవి)- 30 గ్రాములు
జీడిపప్పు (ముక్కలుగా తరిగినవి) - 50 గ్రాములు
తయారీ విధానం...
పాలలో నానబెట్టిన కుంకుమపువ్వుని గ్రైండ్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కోవాని చిదిమి బ్రౌన్‌ కలర్‌ వచ్చిందాక వేగించి పక్కన పెట్టుకోవాలి.
నెయ్యిని వేడి చేసి అందులో సేమ్యా వేసి సన్నని సెగ మీద బ్రౌన్‌ కలర్‌ వచ్చేదాకా వేగించి అందులో పాలుపోయాలి. రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చాక పంచదారని కూడా వేసి బాగా కలియబెట్టండి. పంచదార కరిగి నీరు ఇగిరి పోయిందాకా మెల్లిగా ఉడికించండి. అందులో కుంకుమపువ్వుని కూడా వేసి సేమ్యా పొడిగా అయిన తరువాత సగం కోవాని అందులో వేసి బాగా కలపండి. ఒక గిన్నె తీసుకుని అందులో సేమ్యా పాయసాన్ని వేసి దానిపైన మిగిలిన కోవా, బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి వడ్డించండి. ఇది నలుగురికి సరిపోతుంది.

Updated Date - 2015-09-02T20:29:08+05:30 IST