Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఉల్లిపాయ టమోటా పచ్చడి

ఉల్లిపాయ టమోటా పచ్చడి

కావ

లసిన పదార్థాలు: తరిగిన టమోటోలు - 2 కప్పులు, (సాంబారులో వాడే) చిన్న ఉల్లిపాయ తరుగు - అరకప్పు, పెద్దఉల్లిపాయ తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 1, ఇంగువ - పావు టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి రెండు రకాల ఉల్లి తరుగులు మెత్తబడేదాకా వేగించుకోవాలి. తర్వాత టమోటా, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ వేసి టమోటోలోని నీరంతా ఇగిరేదాకా సన్నని మంటపై మగ్గించాలి. చల్లబడ్డాక ఉప్పు జతచేసి గ్రైండు చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను నువ్వుల నూనెలో ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాలింపు పెట్టుకుని ఉల్లి, టమోటా మిశ్రమంలో కలపాలి. ఈ పచ్చడి వేడి వేడి ఇడ్లీలతో, దోశలతో చాలా బాగుంటుంది.

ప్రజల నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టుకోవాలిప్రజల నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టుకోవాలిజిల్లా కేంద్రంలో బీజేపీ రక్షాబంధన్‌జిల్లా కేంద్రంలో బీజేపీ రక్షాబంధన్‌కదిలికి పోటెత్తిన భక్తులుకదిలికి పోటెత్తిన భక్తులుచినుకు వణుకుచినుకు వణుకురుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగరుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగదేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలుదేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలుఆగని అక్రమ దందాఆగని అక్రమ దందాఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షంఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షంప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలిప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలివిద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నావిద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.