ఆపిల్‌ రబ్డి

ABN , First Publish Date - 2015-09-16T17:34:38+05:30 IST

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 3 కప్పులు, చక్కెర - రెండున్నర టే.స్పూన్లు,

ఆపిల్‌ రబ్డి

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 3 కప్పులు, చక్కెర - రెండున్నర టే.స్పూన్లు, యాపిల్‌ తరుగు - 3/4 కప్పులు, బాదం పలుకులు - 3 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను.
తయారీ విధానం: నాన్‌స్టిక్‌ పాన్‌ వేడి చేసి పాలు పోసి చిన్న మంట మీద 25 నిమిషాలు కాచాలి. పాలు సగానికి చిక్కబడేలా తరచుగా కలుపుతూ మరిగించాలి. చక్కెర, యాపిల్‌ తరుగు వేసి చిన్న మంట మీద ఉంచి కలుపుతూ 4 నిమిషాలు ఉడికించాలి. బాదం పలుకులు, యాలకుల పొడి వేసి కలపాలి. రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-09-16T17:34:38+05:30 IST