సజ్జల లడ్డూ

ABN , First Publish Date - 2015-09-03T00:25:34+05:30 IST

కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు, బెల్లం తరుగు - 1 కప్పు, నెయ్యి - అర కప్పు.

సజ్జల లడ్డూ

కావలసిన పదార్థాలు: సజ్జలు - 1 కప్పు, బెల్లం తరుగు - 1 కప్పు, నెయ్యి - అర కప్పు.
తయారుచేసే విధానం: సజ్జలను దోరగా వేగించి, చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేయాలి. తర్వాత బెల్లం తురుము కూడా కలిపి మరోసారి తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, వేడి నెయ్యి కొద్ది కొద్దిగా కలుపుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే పది రోజుల వరకూ తాజాగా ఉంటాయి.

Updated Date - 2015-09-03T00:25:34+05:30 IST