పనీర్‌ పిస్తా

ABN , First Publish Date - 2015-09-02T22:27:11+05:30 IST

కావలసిన పదార్థాలు : పిస్తా - 200 గ్రా., పనీర్‌ - 100 గ్రా., పంచదార - 75 గ్రా.,

పనీర్‌ పిస్తా

కావలసిన పదార్థాలు : పిస్తా - 200 గ్రా., పనీర్‌ - 100 గ్రా., పంచదార - 75 గ్రా., యాలకుల పొడి - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం : ముందుగా పిస్తా, పనీర్‌లను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత దళసరి అడుగున్న మూకుడులో తురిమిన పనీర్‌, పంచదారలు కలిపి సన్నని సెగమీద వేడిచేయాలి. పంచదార కరిగాక పిస్తా, యాలకుల పొడి వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పళ్లెంలో సమానంగా పర్చి, చల్లారనిచ్చి మీకు కావలసిన ఆకారాల్లో కట్‌ చేసుకోవచ్చు. దీన్ని చేసుకోవడం చాలా సులభం కాబట్టి ప్రయత్నించి చూడండి.

Updated Date - 2015-09-02T22:27:11+05:30 IST