డేట్‌-ఫ్రూట్‌-సాస్‌

ABN , First Publish Date - 2015-12-08T16:27:36+05:30 IST

కావలసిన పదార్థాలు : ఎండు ఖర్జూరాలు-20, పంచదార-1 కప్పు, పైనాపిల్‌ ముక్కలు-అర కప్పు, దానిమ్మ గింజలు-అర కప్పు, కిస్‌మిస్‌-అర కప్పు, చెర్రీస్‌-10, బాదంపప్పు-10,

డేట్‌-ఫ్రూట్‌-సాస్‌

కావలసిన పదార్థాలు : ఎండు ఖర్జూరాలు-20, పంచదార-1 కప్పు, పైనాపిల్‌ ముక్కలు-అర కప్పు, దానిమ్మ గింజలు-అర కప్పు, కిస్‌మిస్‌-అర కప్పు, చెర్రీస్‌-10, బాదంపప్పు-10, జీడిపప్పు-10, ఆమ్‌చూర్‌(ఎండు మామిడిపొడి)-1 టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర పొడి-అర టీస్పూన్‌, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : ఎండు ఖర్జూరాలను ముందుగానే నానబెట్టి ముక్కలుగా కట్‌ చేసి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పావుకప్పు నీరు పోసి, అందులో పంచదార వేసి స్టవ్‌పై పెట్టి కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఖర్జూరపండు ముక్కలు, పైనాపిల్‌ ముక్కలు, ఆమ్‌చూర్‌, కిస్‌మిస్‌, చెర్రీస్‌, బాదంపప్పు, జీడిపప్పు, ఉప్పు వేసి కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. చిక్కబడుతున్న సమయంలోనే దానిమ్మ గింజలు కూడా వేసి స్టవ్‌ మీది నుంచి దించేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. దీన్ని ఒక గాజు బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. ఈ డేట్‌-ఫ్రూట్‌-సాస్‌ను విడిగానూ తినొచ్చు లేదా పరోటాలు, పూరీలు, చపాతీలతోపాటూ తినొచ్చు.

Updated Date - 2015-12-08T16:27:36+05:30 IST