లేడీస్‌ డిలైట్‌

ABN , First Publish Date - 2018-06-09T21:44:58+05:30 IST

పేస్ట్రీ షీట్లు (ఫ్రోజన్‌ అండ్‌ డిఫ్రాస్ట్‌)-25, స్వీట్‌ కండెన్స్డ్‌ మిల్క్‌-400 గ్రాములు, నీళ్లు- 750 ఎంఎల్‌, కార్న్‌ఫ్లోర్‌...

లేడీస్‌ డిలైట్‌

కావలసిన పదార్థాలు
పేస్ట్రీ షీట్లు (ఫ్రోజన్‌ అండ్‌ డిఫ్రాస్ట్‌)-25, స్వీట్‌ కండెన్స్డ్‌ మిల్క్‌-400 గ్రాములు, నీళ్లు- 750 ఎంఎల్‌, కార్న్‌ఫ్లోర్‌-90 గ్రాములు, ఆరెంజ్‌ లాంటి సువాసనలు వెదజల్లే బ్లోజమ్‌ వాటర్‌- ఒక టేబుల్‌స్పూను, వెజిటబుల్‌ ఆయిల్‌- రెండు కప్పులు (వేగించడానికి), పిస్తాపప్పులు- రెండు టేబుల్‌స్పూన్లు (సన్నగా తరిగి), నిమ్మ వాసనలు వెదజల్లే బ్లోజమ్‌ సిరప్‌.
 
చక్కెర పాకానికి: చక్కెర-500 గ్రాములు, నీళ్లు-250ఎంఎల్‌, నిమ్మరసం, రోజ్‌వాటర్‌, సహజ సువాసనలు వెదజల్లే బ్లోజమ్‌ వాటర్‌-ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను.
చక్కెరపాకం తయారీ: సాస్‌ పాన్‌లో చక్కెర, నీళ్లు పోసి ఆరు నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి దాన్ని నిమ్మ రసం, రోజ్‌వాటర్‌, బ్లోజమ్‌ వాటర్‌ మిశ్రమంలో కలపాలి.
 
తయారీవిధానం
ఫిలో పేస్ట్రీ షీట్స్‌ను (15 సెంటీమీటర్ల పొడవు, 7 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలా)కట్‌ చేసి, చల్లటి గుడ్డలో చుట్టి పెట్టాలి. సాస్‌పాన్‌లో తీయటి చిక్కటి పాలు, నీళ్లు, కార్న్‌ఫ్లోర్‌ వేయాలి. స్టవ్‌ మీద పెట్టి ఆ మిశ్రమం చిక్కబడేంతవరకూ కలుపుతుండాలి. సుగంధ పరిమళాలు చిందించే బ్లోజమ్‌ వాటర్‌ను పోసి బాగా కలిపి స్టవ్‌ నుంచి దించి చల్లారనివ్వాలి. టేబుల్‌ మీద ఒక షీటు పెట్టి దానికి పూర్తి వ్యతిరేక దిశలో మరో షీటును అమర్చాలి. చల్లారిన మిశ్రమాన్ని గరిటెతో కలిపి ఆ మిశ్రమాన్ని షీట్లపై ఒక్కో టేబుల్‌ స్పూను వేసి రెండు అంచులను మడిచి రోల్స్‌లా చేయాలి. పాన్‌లో నూనె వేడెక్కాక ఈ రోల్స్‌ వేసి బంగారు రంగులోకి వచ్చేదాకా వేగించాలి. వీటిని చక్కెర పాకంలో వేసి వెంటనే జల్లెడలోకి తీయాలి. ఇలా చేస్తే ఎక్కువయిన పాకం కారిపోతుంది. పిస్తాపప్పులు, సిరప్‌ చల్లి తింటే యమ్మీగా ఉంటాయి.

Updated Date - 2018-06-09T21:44:58+05:30 IST