పూల్‌మఖానా ఖీర్

ABN , First Publish Date - 2016-08-17T17:56:03+05:30 IST

ఫూల్‌మఖానా (తామర గింజలు) - ఒక కప్పు, పాలు - అరలీటర్‌, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన, యాలకుల పొడి - అర టీ స్పూన, బాదంపప్పు - 4

పూల్‌మఖానా ఖీర్

కావలసిన పదార్ధాలు: ఫూల్‌మఖానా (తామర గింజలు) - ఒక కప్పు, పాలు - అరలీటర్‌, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన, యాలకుల పొడి - అర టీ స్పూన, బాదంపప్పు - 4

 
తయారుచేసే పద్దతి:ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి ఫూల్‌మఖానాని ఎర్రగా, క్రిస్పీగా అయ్యేదాకా వేయించి పక్కన పెట్టాలి. వేయించిన ఫూల్‌మఖానాలో కొన్ని మిక్సీ జార్‌లో వేసి పొడిచేసి పెట్టాలి. అడుగు మందంగా ఉన్న బాండీ లేదా గిన్నెలో పాలు పోసి మరిగించాలి. మరిగిన పాలలో పొడిచేసి పెట్టిన ఫూల్‌మఖానా వేసి బాగా కలపాలి. ఇందులో పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన ఫూల్‌మఖానా కూడా వేసి, బాగా కలిపి, స్టవ్‌ని సిమ్‌లో ఉంచి 9 - 10 నిమిషాలు ఉడికించాలి. బాదం పలుకులు కూడా వేసి, స్టవ్‌ని పూర్తిగా సిమ్‌లో ఉంచి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. టేస్టీగా, ఈజీగా తయారయ్యే ఫూల్‌ మఖానా ఖీర్‌ రెడీ. దీన్ని వేడిగా కానీ, చల్లగా కానీ తినొచ్చు. చల్లబడితే కొంచెం చిక్కగా తయారయి బాగుంటుంది.

Updated Date - 2016-08-17T17:56:03+05:30 IST