అటుకులు, పల్లీల లడ్డు

ABN , First Publish Date - 2017-08-12T18:52:28+05:30 IST

అటుకులు - ఒక కప్పు, పంచదార - అరకప్పు, పల్లీగింజలు, నెయ్యి -ఒక్కోటి పావు కప్పు చొప్పున..

అటుకులు, పల్లీల లడ్డు

కావలసినవి: అటుకులు - ఒక కప్పు, పంచదార - అరకప్పు, పల్లీగింజలు, నెయ్యి -ఒక్కోటి పావు కప్పు చొప్పున, వంటల్లో వాడే కర్పూరం - చిటికెడు,యాలకుల పొడి - ముప్పావు టీస్పూన్‌, జీడిపప్పులు - ఐదు.
 
తయారీ:
అటుకుల్ని నూనె వేయకుండా సన్నటి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించి, చల్లార్చాలి. పల్లీగింజలను కూడా గోధుమ రంగు వచ్చే వరకు నూనె వేయకుండా వేగించి చల్లార్చాలి. పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
తరువాత వేగించిన అటుకుల్ని మెత్తటి పిండిలా గ్రైండ్‌ చేయాలి. పంచదారను కూడా అలానే మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అటుకులు, పంచదార, పల్లీగింజలు,
యాలకుల పొడిని వెడల్పాటి గిన్నెలో వేసి అందులో కర్పూరం పొడి వేసి కలపాలి.
జీడిపప్పుని చిన్న చిన్న పలుకులుగా చేయాలి. తరువాత నెయ్యి వేడిచేసి ఆ పలుకుల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వేడిచేసిన నెయ్యిని అటుకుల మిశ్రమంలో పోసి స్పూన్‌తో కలపాలి. మిశ్రమం చేతితో పట్టుకునే వేడి ఉన్నప్పుడు లడ్డూలు చేయాలి. గాలి
చొరబడని డబ్బాలో ఉంచితే రెండు వారాల వరకు పాడుకావు.

Updated Date - 2017-08-12T18:52:28+05:30 IST