Abn logo

స్వీట్‌ పొటాటో ఫ్రైస్‌

కావలసినవి
ఆలివ్‌ నూనె - సరిపడా, స్వీట్‌ పొటాటో (గెనుసుగడ్డ లేదా చిలగడదుంప) - పెద్దవి ఆరు (తొక్క తీసి నిలువుగా తరిగి), ఉప్పు - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి, దాల్చిన చెక్కల పొడి - కొంచెం.
 
తయారీ విధానం
ముందుగా ఒవెన్‌ను 425 డిగ్రీల వరకు వేడిచేయాలి. నిలువుగా తరిగిన గెనుసుగడ్డ ముక్కలను పెద్ద జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేయాలి. అందులో కొంచెం ఆలివ్‌ నూనె, వెల్లుల్లి, దాల్చిన చెక్కల పొడి వేసి ముక్కలకు పట్టేలా బ్యాగ్‌ను అటుఇటు కదపాలి. ఆ తరువాత ముక్కలను బేకింగ్‌ షీట్‌ మీద వేయాలి. అయితే ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. గెనుసుగడ్డ ముక్కలను ఉంచిన బేకింగ్‌ షీట్‌ను ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచాలి. తరువాత ముక్కలను తిప్పి మరో పది నిమిషాలు ఒవెన్‌లో ఉంచాలి. అవి లోపల మెత్తగా ఉడికి బయటి వైపు గోధుమ రంగుకి రావాలి. ఐదు నిమిషాలు చల్లారాక తింటే టేస్టీగా ఉంటాయి స్వీట్‌ పొటాటో ఫ్రైస్‌. వీటిని బంగాళాదుంపలతో కూడా చేసుకోవచ్చు.

టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసనపల్లెలకు ‘ప్రకృతి’ శోభమంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌
Advertisement
Advertisement