Abn logo

బీట్‌రూట్‌ సూప్‌ విత్‌ చిక్‌పీస్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
కొబ్బరి నూనె - ఒక టేబుల్‌ స్పూను, ఉల్లిపాయలు - 2, వెల్లుల్లి రేకలు - 2, అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను, బీట్‌రూట్‌ (చిన్నవి) - 6, ఉప్పు, మిరియాలపొడి - చిటికెడు చొప్పున, గ్రీన్‌ కర్రీ పేస్టు - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, జీరాపొడి - అర టీ స్పూను, కారం - పావు టీ స్పూను, యాలకులు, ధనియాల పొడి - చిటికెడు చొప్పున, పలచని కొబ్బరి పాలు - ఒక కప్పు, వెజిటెబుల్‌ స్టాక్‌ - 2 కప్పులు, కోకనట్‌ షుగర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు - గుప్పెడు.
 
తయారుచేసే విధానం
 
ఒక పాత్రలో నూనె వేసి ఉల్లి, అల్లం తరుగు రెండు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు బీట్‌రూట్‌ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కర్రీ పేస్టు, మిగతా పొడులన్నీ వేసి మూతపెట్టి 4 నిమిషాలు మగ్గించాలి. తర్వాత కొబ్బరి పాలు, వెజిటెబుల్‌ స్టాక్‌, కోకనట్‌ షుగర్‌ కలిపి బీట్‌రూట్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించి దించేయాలి. చల్లారిన బీట్‌రూట్‌ ముక్కలు విడిగా పేస్టు చేసి మిశ్రమంలో కలపాలి. సర్వ్‌ చేసేముందు ఉడికించిన కాబూలీ మసాలా శనగలు, కొత్తిమీర తరుగు సూప్‌పై చల్లుకుంటే బాగుంటుంది.

ప్రజలతో మమేకమై మన్ననలు పొందాలి: ఎస్పీప్రత్యేక ఓటరు నమోదును విజయవంతం చేయాలినిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదంపశువైద్యం అందని ద్రాక్షేనా?దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల రాస్తారోకోవంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలికుమరం భీం, కుమరం సూరు వర్ధంతిముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాలి‘విజయగర్జన’కు కార్యకర్తలు తరలిరావాలి సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
Advertisement