Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మసాలా ఆవకాయ

మసాలా ఆవకాయ

v id="pastingspan1">కావలసినవి
 
మామిడికాయ ముక్కలు - కేజీ, నువ్వుల నూనె - 250 ఎం.ఎల్‌, అల్లం ముద్ద - 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, ఉప్పు - 250 గ్రాములు, జీలకర్ర పొడి - 50 గ్రాములు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్‌లు, గరం మసాల పొడి - టేబుల్‌స్పూన్‌, మెంతిపొడి - టీస్పూన్‌, పసుపు - టేబుల్‌స్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర, మెంతులు - టీస్పూన్‌, ఎండుమిర్చి - ఆరు.
 
తయారీవిధానం
 
మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ళ కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం, వెల్లులి ముద్దలు వేసి కలపాలి. చల్లబడిన తర్వాత మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి కలియబెట్టాలి. ఇందులోనే కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర కూడా వేసి మొత్తం బాగా కలిసాక శుభ్రమైన జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి. మామూలు ఆవకాయ కంటే ఇది కాస్త ఘాటుగా ఉంటుంది..

జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలుజిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలుమాతా, శిశు రక్షణకు పకడ్బందీ చర్యలుమాతా, శిశు రక్షణకు పకడ్బందీ చర్యలుఆసరాపై ఆశలు‘ఆసరా’పై ఆశలుజిల్లాలో ఘనంగా మొహర్రం జిల్లాలో ఘనంగా మొహర్రం త్రివర్ణ పతాకాల పంపిణీత్రివర్ణ పతాకాల పంపిణీఆదివాసీలు ఐక్యంగా ఉండాలిఆదివాసీలు ఐక్యంగా ఉండాలిఉప్పొంగిన పెన్‌గంగాఉప్పొంగిన పెన్‌గంగాప్రమాదపుటంచున కుమరం భీం ప్రాజెక్టుప్రమాదపుటంచున కుమరం భీం ప్రాజెక్టుజిల్లా స్థాయి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుల ఎంపిక  జిల్లా స్థాయి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుల ఎంపిక కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.