Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ముల్తానీ పనీర్‌ టిక్కా

ముల్తానీ పనీర్‌ టిక్కా

v id="pastingspan1">కావలసినవి
 
జున్ను- అరకేజీ, పుట్టగొడుగులు- రెండు కప్పులు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- రెండు, అల్లం- చిన్నముక్క, కరివేపాకు- ఒక కట్ట, గరంమసాలా- అర టీస్పూన్‌, మిరియాల పొడి- ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సెనగపిండి- అరకప్పు, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.
 
తయారీవిధానం
 
పాన్‌లో నూనె వేసి, కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పుట్టగొడుగులు వేసి వేగించాలి.
ఉప్పు, గరంమసాలా, మిరియాల పొడి, జీలకర్ర వేసి మరికాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జున్నులో అల్లం పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పుట్టగొడుగుల మిశ్రమంతో కలిపి పక్కన పెట్టుకోవాలి.
పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా, మధ్యలో కట్‌ చేసి రెండు స్లైస్‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు పుట్టగొడుగుల మిశ్రమాన్ని ఒక పనీర్‌ స్లైస్‌పై రాసి, మరొక స్లైస్‌తో మూసేయాలి. తరువాత సెనగపిండిలో కొన్ని నీళ్లు పోసి మరీ చిక్కగా కాకుండా, పలుచగా కాకుండా కలపాలి. పనీర్‌ స్లైస్‌లను ఈ పిండిలో అద్దుతూ గోధుమరంగు వచ్చే వరకు రెండు వైపులా నూనెలో వేగించాలి. పుదీనా చట్నీతో తింటే ముల్తానీ పనీర్‌ టిక్కా రుచి అదిరిపోతుంది.

ప్రజల నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టుకోవాలిప్రజల నమ్మకాన్ని పోలీసులు నిలబెట్టుకోవాలిజిల్లా కేంద్రంలో బీజేపీ రక్షాబంధన్‌జిల్లా కేంద్రంలో బీజేపీ రక్షాబంధన్‌కదిలికి పోటెత్తిన భక్తులుకదిలికి పోటెత్తిన భక్తులుచినుకు వణుకుచినుకు వణుకురుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగరుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగదేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలుదేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలుఆగని అక్రమ దందాఆగని అక్రమ దందాఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షంఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షంప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలిప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలివిద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నావిద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.