ఆమ్లా క్యాండీ

ABN , First Publish Date - 2019-11-11T18:03:35+05:30 IST

ఉసిరికాయలు - ఒక కిలో, పంచదార - ఒకటిన్నర కిలో.

ఆమ్లా క్యాండీ

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కిలో, పంచదార - ఒకటిన్నర కిలో.

తయారీ విధానం: ఉసిరికాయలను కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత వాటి గింజలు తీసేసి, ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక స్టోరేజ్‌ బాక్స్‌లోఉసిరికాయ ముక్కలను ఉంచి వాటి మీద పంచదార పోసి భద్రపరచాలి. రెండు రోజుల తరువాత చూస్తే ఉసిరికాయ ముక్కలు పంచదార పానకంపై తేలుతూ కనిపిస్తాయి. ఇప్పుడు పానకంలోని ఉసిరికాయ ముక్కలను తీసి రెండు రోజులు ఎండబెట్టాలి. తరువాత గదిలో ఫ్యాన్‌ కింద మరో రెండు రోజులు ఆరనిస్తే నోరూరించే ఆమ్లా క్యాండీలు రెడీ. వీటిని బాక్స్‌లో భద్రపరచుకోవాలి. ఈ క్యాండీలను పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-11-11T18:03:35+05:30 IST