ఆప్రికాట్‌ లడ్డు

ABN , First Publish Date - 2018-03-13T18:47:19+05:30 IST

ఎండు ఆప్రికాట్‌ - అర కప్పు, ఎండు ద్రాక్ష - అర కప్పు, బాదం - పావు కప్పు...

ఆప్రికాట్‌ లడ్డు

కావలసిన పదార్థాలు
 
ఎండు ఆప్రికాట్‌ - అర కప్పు
ఎండు ద్రాక్ష - అర కప్పు
బాదం - పావు కప్పు
వాల్‌నట్స్‌ - పావు కప్పు
పచ్చికొబ్బరి కోరు - 3 టేబుల్‌ స్పూన్లు
వెనీలా ఎసెన్స్‌ - కొన్ని చుక్కలు
ఫ్లాక్స్‌ సీడ్‌ పౌడర్‌ - 1 టేబుల్‌ స్పూను
దాల్చినచెక్క పొడి - 1 టేబుల్‌ స్పూను
 
తయారీ విధానం
 
వెనీలా ఎసెన్స్‌ మినహా మిగతా పదార్థాలన్నీ ఫుడ్‌ ప్రాసెసర్‌లో వేసి తిప్పాలి.
తర్వాత వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి.
పై పదార్థాలన్నీ తీపిగానే ఉంటాయి కాబట్టి, అదనంగా చక్కెర కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీపి ఎక్కువ కావాలనిపిస్తే రెండు టీస్పూన్ల తేనె కలుపుకోవచ్చు.
చివర్లో లడ్డుగా చుట్టి ఎండు కొబ్బరి కోరులో దొర్లించాలి.
వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే కొన్ని వారాల వరకూ పాడవకుండా ఉంటాయి.

Updated Date - 2018-03-13T18:47:19+05:30 IST