Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉసిరి రసం

కావలసినవి
ఉడికించిన కందిపప్పు-అరకప్పు, ఉసిరికాయలు(పెద్దవి)-ఐదు, మిరియాలు, జీలకర్ర పొడి- ఒక్కొక్క టీస్పూను, పచ్చిమిరపకాయలు-నాలుగు (నిలువుగా రెండుముక్కలుగా చీరాలి), కరివేపాకు-తగినంత, ఇంగువ-చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూను, కొత్తిమీర- టేబుల్‌స్పూను, ఆవాలు-పావుస్పూను, నూనె-టీస్పూను, పసుపుపొడి-అర టీస్పూను.
 
తయారీ
ఉసిరికాయల్లోంచి గింజలు తీసేయాలి. కాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వాటిలో ముప్పావు కప్పు నీళ్లు పోసి మిక్సర్‌లో వేసి పేస్టులా చేయాలి. అందులోంచి రసాన్ని (జ్యూసును) తీసి ఒక గిన్నెలో పోయాలి. తర్వాత ఉడికిన పప్పు, ఉసిరి జ్యూసు, జీలకర్ర, మిరియాల పొడులతోపాటు పసుపు పొడి కూడా ఒక గిన్నెలో వేసి ఆ మిశ్రమాన్ని కలపాలి. తర్వాత ఒక ప్యాన్‌ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు, తరిగిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లి పేస్టు, ఇంగువలను కూడా అందులో వేసి చక్కని సువాసన వచ్చేదాకా వేగించాలి. అందులో పప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. రసం కాసేపు ఉడికిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి, సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీరను చల్లి అన్నంలో వేడిగా కలుపుకుతింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement