గోరు చిక్కుడు పచ్చడి

ABN , First Publish Date - 2017-10-28T23:55:34+05:30 IST

లేత గోరు చిక్కుడు - 200 గ్రా., పచ్చిమిర్చి - 6, నువ్వులు - రెండున్నర టేబుల్‌ స్పూన్లు, నానబెట్టిన చింతపండు..

గోరు చిక్కుడు పచ్చడి

కావలసిన పదార్థాలు
 
లేత గోరు చిక్కుడు - 200 గ్రా., పచ్చిమిర్చి - 6, నువ్వులు - రెండున్నర టేబుల్‌ స్పూన్లు, నానబెట్టిన చింతపండు - ఉసిరికాయంత, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కరివేపాకు, నూనె - తిరగమోతకు సరిపడా.
 
తయారుచేసే విధానం
 
నువ్వులను వేగించి పొడి చేసి పక్కనుంచాలి. నూనెలో గోరుచిక్కుడు ముక్కలు వేసి చిన్నమంటపై మెత్తబడేవరకు వేగించి తీసెయ్యాలి. అదే కడాయిలో పచ్చిమిర్చి కూడా వేగించాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో గోరుచిక్కుడు ముక్కలతో పాటు పచ్చిమిర్చి, నువ్వుల పొడి, ఉప్పు, చింతపండు వేసి రుబ్బుకోవాలి. తర్వాత విడిగా తిరగమోత పెట్టి రుబ్బిన మిశ్రమంలో కలపాలి. వేడి వేడి అన్నంతో పాటు దోశల్లోకి కూడా ఈ పచ్చడి బాగుంటుంది.

Updated Date - 2017-10-28T23:55:34+05:30 IST