Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అదా ప్రదమాన్‌

అదా ప్రదమాన్‌

rong style="color: #ff0000;">కావలసిన పదార్థాలు: అటుకులు - 100 గ్రా, బెల్లం తరుగు - పావు కిలో, పల్చని కొబ్బరి పాలు - 5 కప్పులు, చిక్కని కొబ్బరి పాలు- 1 కప్పు, నెయ్యి-2 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, జీలకర్ర పొడి - పావు టీస్పూను, కొబ్బరి ముక్కలు - 2 టే.స్పూన్లు, జీడిపప్పు, ఎండుద్రాక్ష - తగినన్ని
 
 తయారీ విధానం:
బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలి.
గిన్నెలో నీళ్లు వేడి చేసి మరిగాక మంట తీసి అటుకులు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత పల్చని కొబ్బరి పాలు పోసి కలిపి చిన్న మంట మీద అటుకులు మెత్తబడేవరకూ ఉడికించాలి.
చిక్కబడ్డాక బెల్లం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి.
మరో గిన్నెలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయించి తీయాలి.
అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించు కోవాలి.
అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోసి మంట తీసేయాలి.
కొబ్బరి పాలు పోశాక ఉడికిస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పాలు పోసిన వెంటనే మంట తీసేయాలి.
దీన్లో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి వడ్డించాలి.

జిల్లాలో నకిలీ విత్తనాలపై చర్యలేవి?జిల్లాలో నకిలీ విత్తనాలపై చర్యలేవి?పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలిపోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలివైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలివైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలిఅందరికీ మంచి పేరు తీసుకురావాలిఅందరికీ మంచి పేరు తీసుకురావాలి టైర్‌ పంక్చర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం టైర్‌ పంక్చర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదంవర్షంతో అతలాకుతలంవర్షంతో అతలాకుతలంఘనంగా జాతీయ పైలెట్స్‌ దినోత్సవం ఘనంగా జాతీయ పైలెట్స్‌ దినోత్సవం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి గడ్డిక్షేత్రాల పెంపకంతో పెరిగిన వన్యప్రాణులుగడ్డిక్షేత్రాల పెంపకంతో పెరిగిన వన్యప్రాణులురేషన్‌ డీలర్లకు మొండిచెయ్యిరేషన్‌ డీలర్లకు మొండిచెయ్యి
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.