వెజిటబుల్ స్టాక్
v>
కావలసినవి: కాలీఫ్లవర్ పువ్వులు, కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లి, క్యాబేజీ, క్యారెట్ ముక్కలు ఒక్కోటి పావు కప్పు చొప్పున, సెలెరీ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ: మూడు కప్పుల నీళ్లను లోతైన గిన్నెలో పోసి వేడిచేయాలి. తరువాత క్యాబేజీ, కాలీఫ్లవర్, సెలెరీ, క్యారెట్ ముక్కలు వేసి పది నిమిషాలు మంటను హైలో ఉంచి ఉడికించాలి. నీళ్లను వడకడితే స్టాక్ రెడీ. కావాలంటే ఇందులోని కూరగాయ ముక్కల్ని కూడా వాడుకోవచ్చు.