క్యారెట్‌, కొబ్బరి సూప్‌

ABN , First Publish Date - 2016-02-04T15:36:40+05:30 IST

కావలసిన పదార్థాలు: ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి(తరుగు), క్యారెట్లు - ఎనిమిది (తొక్క తీయొద్దు. చిన్న ముక్కలుగా తరగాలి), ఉడికించిన

క్యారెట్‌, కొబ్బరి సూప్‌

కావలసిన పదార్థాలు: ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి(తరుగు), క్యారెట్లు - ఎనిమిది (తొక్క తీయొద్దు. చిన్న ముక్కలుగా తరగాలి), ఉడికించిన కూరగాయల నీళ్లు - మూడున్నర కప్పులు, కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు, అల్లం తరుగు - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, కూర పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్‌, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా.
తయారీ విధానం: ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఆలివ్‌ నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు వేసి సన్నటి సెగ మీద ఏడు నిమిషాల పాటు వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి ఐదు నిమిషాల తరువాత ఉడికించిన కూరగాయల నీళ్లు, కొబ్బరి పాలు పోయాలి. అల్లం, కూర పొడి వేసి మూత పెట్టి క్యారెట్‌ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి. ఇందుకు పావుగంట పడుతుంది. ఈ మిశ్రమం చల్లారిన తరువాత బ్లెండర్‌ జార్‌లో వేసి తిప్పాలి. ఉప్పు, మిర్చి తునకలు చల్లుకుని కొత్తిమీరతో అలంకరించుకుని తాగితే హాయిగా ఉంటుంది.

Updated Date - 2016-02-04T15:36:40+05:30 IST