Abn logo

క్యారెట్‌ 65

కావలసిన పదార్థాలు
 
క్యారెట్లు పెద్దవి-3, రెడ్‌ కలర్‌-చిటికెడు, ఉప్పు-తగినంత, నూనె-తగినంత, పచ్చిమిర్చి ముద్ద-అర టీస్పూన్‌, మొక్కజొన్న పిండి-ఒక టేబుల్‌ స్పూన్‌, మైదా-ఒక టీ స్పూన్‌, మిరియాల పొడి-ఒక టీస్పూన్‌, సోయా సాస్‌-ఒక టీస్పూన్‌.
తయారుచేయు విధానం
 
క్యారెట్లను క్యూబ్స్‌ ఆకారంలో ముక్కలుగా కోసి మంచినీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, సోయాసాస్‌, మిరియాలపొడి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, రెడ్‌ కలర్‌ అన్నీ వేసి, మంచినీళ్ళు చేర్చుతూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉడికించిన క్యారెట్‌ క్యూబ్స్‌ను వేయాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో నూనె పోసి అది బాగా వేడెక్కాక క్యారెట్‌ క్యూబ్స్‌ను నూనెలో వేసి వేగించాలి. మరో బాణలిలో వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వేగించి అందులో వేగించిన క్యారెట్‌ క్యూబ్స్‌ వేసి కలిపి దించేయాలి. చికెన్‌ 65లాగా ఈ క్యారెట్‌ 65ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 

భూ మాయఏజెన్సీలోకి కరోనా ‘పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి’పదో తరగతి పరీక్ష సెంటర్లకు శానిటైజర్లుఉట్నూర్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌మొక్కల పెంపకానికి మియవాకీ పద్ధతి భేష్‌’ ఎస్సెస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిబాలుడిని ఆదుకోరూ...!గాంధీ ఆసుపత్రి నుంచి 23 మంది డిశ్చార్జిహత్య కేసులో దంపతుల అరెస్టు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement