Abn logo

క్యారెట్‌ 65

కావలసిన పదార్థాలు : క్యారెట్లు పెద్దవి-3, రెడ్‌ కలర్‌-చిటికెడు, ఉప్పు-తగినంత, నూనె-తగినంత, పచ్చిమిర్చి ముద్ద-అర టీస్పూన్‌, మొక్కజొన్న పిండి-ఒక టేబుల్‌ స్పూన్‌, మైదా-ఒక టీ స్పూన్‌, మిరియాల పొడి-ఒక టీస్పూన్‌, సోయా సాస్‌-ఒక టీస్పూన్‌ 


తయారుచేయు విధానం : క్యారెట్లను క్యూబ్స్‌ ఆకారంలో ముక్కలుగా కోసి మంచినీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, సోయాసాస్‌, మిరియాలపొడి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, రెడ్‌ కలర్‌ అన్నీ వేసి, మంచినీళ్ళు చేర్చుతూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉడికించిన క్యారెట్‌ క్యూబ్స్‌ను వేయాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో నూనె పోసి అది బాగా వేడెక్కాక క్యారెట్‌ క్యూబ్స్‌ను నూనెలో వేసి వేగించాలి. మరో బాణలిలో వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వేగించి అందులో వేగించిన క్యారెట్‌ క్యూబ్స్‌ వేసి కలిపి దించేయాలి. చికెన్‌ 65లాగా ఈ క్యారెట్‌ 65ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

పేకాట రాయుళ్ల అరెస్టు ఆదివాసీ గిరిజన యువకుడికి అరుదైన గౌరవంపల్లెప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలిసమస్యలు పరిష్కరించాలిఇంటి వద్ద నుంచే ఉచిత న్యాయ సేవలు పొందవచ్చురామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణలారీ బైక్ ఢీగుప్పుమంటున్న గుడుంబాఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపులో వివక్ష
Advertisement
Advertisement