మ్యాంగో పంచ్‌

ABN , First Publish Date - 2018-05-19T19:15:48+05:30 IST

మామిడిపండుముక్కలు-ఒక కప్పు, బొప్పాయిముక్కలు-ఒక కప్పు, కమలాపండురసం- ఒక కప్పు..

మ్యాంగో పంచ్‌

కావలసినవి
 
మామిడిపండుముక్కలు-ఒక కప్పు, బొప్పాయిముక్కలు-ఒక కప్పు, కమలాపండురసం- ఒక కప్పు, నిమ్మరసం-పావు కప్పు, చక్కెర-పావు కప్పు, కమలాపండు తొక్క తురుము-ఒక టీస్పూను, నీళ్లు-నాలుగు కప్పులు.
 
తయారీవిధానం
 
పళ్ల ముక్కలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తగా ప్యూరీలా చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపాలి. మిగతా పదార్థాలను ప్యూరీలో కలిపి గ్రైండ్‌ చేయాలి. స్మూతీ మీద ఐస్‌ ముక్కలను వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-05-19T19:15:48+05:30 IST