మటన్‌ హలీమ్‌

ABN , First Publish Date - 2018-05-26T21:29:57+05:30 IST

బోన్‌లెస్‌ మటన్‌-250 గ్రాములు, అల్లం-వెల్లుల్లిముద్ద- టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, పచ్చిమిర్చి...

మటన్‌ హలీమ్‌

కావలసినవి
 
బోన్‌లెస్‌ మటన్‌-250 గ్రాములు, అల్లం-వెల్లుల్లిముద్ద- టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, పచ్చిమిర్చి- సరిపడా, గోధుమరవ్వ- కొద్దిగా, మిరియాలు- కొన్ని, గరంమసాలా-అర టీస్పూను, వేగించిన ఉల్లిపాయముక్కలు- ఒకటిన్నర కప్పు, సాజీరా-ఒక స్పూను, పుదీనా-ఒక కట్ట, నూనె- టేబుల్‌స్పూను, నెయ్యి-పావు కప్పు, ధనియాలపొడి- ఒక స్పూను, నిమ్మరసం-టేబుల్‌స్పూను, నీళ్లు-సరిపడా.
 
తయారీవిధానం
 
మటన్‌ని నీటిలో శుభ్రంగా కడగాలి. గోధుమరవ్వను అరగంటసేపు నీళ్లలో నానబెట్టాలి.
కుక్కర్‌లో నూనె వేడిచేయాలి. వేడెక్కిన నూనెలో మటన్‌, మిరియాలు, అల్లంవెల్లుల్లిముద్ద, సాజీరా, గరంమసాలా, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టాలి. ఆరు విజిల్స్‌ వచ్చాక స్టవ్‌ ఆపేయాలి. ఆవిరిపోయాక ఉడికిన మటన్‌ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. కడాయిలో గోధుమరవ్వ, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. రవ్వ ఉడికాక స్టవ్‌ ఆపేయాలి.
మరో కడాయిలో నెయ్యి కరిగించాలి. అందులో ఉడికిన గోధుమరవ్వ, మటన్‌లను వేయాలి. మిశ్రమం ముద్దలా అయ్యాక వేగించిన ఉల్లిపాయముక్కలు, పుదీనా, నిమ్మరసం పైన చల్లి కిందికి దించాలి.

Updated Date - 2018-05-26T21:29:57+05:30 IST