షమీ కబాబ్‌

ABN , First Publish Date - 2017-10-21T22:38:00+05:30 IST

మటన్‌ ఖీమా 500 గ్రాములు, సెనగపప్పు 50గ్రాములు, పచ్చి యాలకులు 5, నల్ల యాలకులు...

షమీ కబాబ్‌

కావల్సిన పదార్థాలు
మటన్‌ ఖీమా 500 గ్రాములు, సెనగపప్పు 50గ్రాములు, పచ్చి యాలకులు 5, నల్ల యాలకులు 3, గుడ్లు 2, ఎండు మిర్చి 5, నల్ల మిరియాల పొడి 5 గ్రాములు, ఉప్పు తగినంత, కొత్తిమీర 30 గ్రాములు, పచ్చిమిరపకాయలు 15 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌ వేయించడానికి తగినంత.
 
తయారీ విధానం
ఓ పాన్‌లో మటన్‌ ఖీమా తీసుకుని, సెనగపప్పు, గ్రీన్‌, బ్లాక్‌ యాలకులు, ఎండు మిరపకాయలు, నల్ల మిరియాలు, ఉప్పు, పసుపు కలపాలి. వాటితో పాటు కొద్దిగా నీళ్లు కూడా కలిపి, సన్నటి సెగపై నీరు ఆవిరయ్యే వరకూ ఉడికించాలి. చల్లారిన తరువాత ఓ ప్రాసెసర్‌లో ఈ మొత్తం వేసి బాగా పేస్ట్‌లా వచ్చేలా చేసి, గుడ్లు కలపాలి. ఈ మిక్స్‌ను మరో గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలపాలి. సమాన భాగాలుగా చేసుకుని బాల్స్‌లా చుట్టుకోవాలి. నెయ్యి చేతికి రాసుకుని ఈ బాల్స్‌ను అటూ ఇటూ నొక్కి.. రెండు- రెండున్నర అంగుళాల వ్యాసార్ధంలో చేసుకోవాలి. పాన్‌లో ఆయిల్‌ తీసుకుని, ఈ టిక్కీలను గోధుమ రంగు వచ్చేలా వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే సలాడ్‌, చట్నీతో సర్వ్‌ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2017-10-21T22:38:00+05:30 IST