బబ్లీ బటర్‌మిల్క్‌

ABN , First Publish Date - 2017-04-15T19:37:46+05:30 IST

పెరుగు- 1/2 కప్పు, నీళ్లు- 1/2 కప్పు, ఉప్పు- తగినంత, అల్లంముక్క- చిన్నది, వెల్లుల్లి- ఒక రెబ్బ, పుదీనా ఆకులు- కొన్ని, జీలకర్రపొడి, రాళ్లఉప్పు, మిరియాల పొడి,

బబ్లీ బటర్‌మిల్క్‌

కావాల్సిన పదార్థాలు: పెరుగు- 1/2 కప్పు, నీళ్లు- 1/2 కప్పు, ఉప్పు- తగినంత, అల్లంముక్క- చిన్నది, వెల్లుల్లి- ఒక రెబ్బ,  పుదీనా ఆకులు- కొన్ని, జీలకర్రపొడి, రాళ్లఉప్పు, మిరియాల పొడి, చక్కెర, ఆమ్‌చూర్‌ (ఇష్టాన్ని బట్టి) అన్నీ కొద్దికొద్దిగా, పచ్చిమిరపకాయ-1, ఐస్‌క్యూబ్స్‌-1-2 (ఇష్టాన్ని బట్టి). అలంకరణకు - కొద్దిగా బూందీ (ఇష్టాన్నిబట్టి), పుదీనా ఆకులు.
 
తయారీ: పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి గ్రైండ్‌ చేయాలి. ఆ డ్రింకు పైన బూంది, పుదీనా ఆకులు చల్లాలి. బూంది, పుదీనా వేసుకోవడం ఇష్టంలేని వాళ్లు బుడగలు బుడగలుగా వచ్చిన ప్లెయిన్‌ మజ్జిగను అలానే తాగేయొచ్చు. ఎండాకాలం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఈ బటర్‌మిల్క్‌ తాగితే హాయిగా ఉంటుంది.

Updated Date - 2017-04-15T19:37:46+05:30 IST