చెర్రీ సొరకాయ కర్రీ

ABN , First Publish Date - 2017-12-09T22:33:51+05:30 IST

ఆలివ్‌ ఆయిల్‌-ఒక టేబుల్‌స్పూను, సొరకాయ-250 గ్రాములు, ఉల్లిపాయ-ఒకటి (తరిగి), నచ్చిన ఆకుకూరలు...

చెర్రీ సొరకాయ కర్రీ

కావలసినవి
ఆలివ్‌ ఆయిల్‌-ఒక టేబుల్‌స్పూను, సొరకాయ-250 గ్రాములు, ఉల్లిపాయ-ఒకటి (తరిగి), నచ్చిన ఆకుకూరలు (సన్నగా తరిగి)- ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లి- ఒక టీస్పూను (సన్నగా తరిగి), అల్లం-అర టీస్పూను (సన్నగా తరిగి), పచ్చిమిర్చి-ఒకటి (తరిగి), కరివేపాకులు- కొన్ని, చెర్రీ టొమోటాలు (చిన్న టొమాటోలు)-4, గ్రీన్‌ బీన్స్‌ ముక్కలు- ఒక కప్పు, నిమ్మరసం-కొద్దిగా (సగం నిమ్మచెక్క), ఉప్పు, మిరియాలపొడి - తగినంత.
 
తయారీ విధానం
సొరకాయను బాగా కడిగి, పైనున్న తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి. ఆలివ్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఆకుకూర వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. అల్లం, వెల్లులి, పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో వేయాలి.
సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసి వేగించాలి. తరిగిపెట్టుకున్న గ్రీన్‌ బీన్స్‌, కరివేపాకు కూడా అందులో కలపాలి. చెర్రీ టొమాటోలు, కొద్దిగా నిమ్మరసం, రుచికోసం తాజా ఆకుకూర ఏదైనా సన్నగా తరిగి అందులో వేయొచ్చు. కూర దగ్గరపడిన తర్వాత కిందికి దించి అన్నం లేదా చపాతీలతో తింటే బాగుంటుంది.

Updated Date - 2017-12-09T22:33:51+05:30 IST