మంగా పులిస్సేరి (కేరళ స్పెషల్‌)

ABN , First Publish Date - 2017-04-30T19:53:01+05:30 IST

మామిడికాయలు- రెండు, కొబ్బరి తురుము- రెండు కప్పులు, పసుపు- ఒక టీ స్పూను, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- ఒక టీ స్పూను,

మంగా పులిస్సేరి (కేరళ స్పెషల్‌)

కావలసిన పదార్థాలు
 
మామిడికాయలు- రెండు, కొబ్బరి తురుము- రెండు కప్పులు, పసుపు- ఒక టీ స్పూను, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర- ఒక టీ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను, పెరుగు- రెండు కప్పులు, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెబ్బలు, నూనె- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
కొబ్బరి తురుములో పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక కొబ్బరి ముద్దను వేసి 3 నిమిషాలు వేగించాలి. ఉప్పు, పెరుగు కూడా వేసి రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత మామిడి ముక్కలను వేసి చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి. మరో గిన్నెలో ఒక టీ స్పూను నూనె పోసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని కూరలో కలిపి, దింపేసి వేడిగా వడ్డించాలి.

Updated Date - 2017-04-30T19:53:01+05:30 IST