మామిడికాయ కూర

ABN , First Publish Date - 2017-03-29T16:19:16+05:30 IST

కావలసినవి పదార్థాలు నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు,

మామిడికాయ కూర

కావలసినవి పదార్థాలు
 
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, కరివేపాకులు - కొన్ని, చిన్న మామిడి కాయలు - 300 గ్రాములు (తొక్క తీసి, పెద్ద ముక్కలుగా తరిగి), బెల్లం తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రెండు టీస్పూన్లు.
 
కొబ్బరి గుజ్జు కోసం
 
ఎండు మిర్చి- 12 (చిన్నవి), మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూన్‌, మెంతులు - రెండు టీస్పూన్లు, బియ్యం - ఒక టేబుల్‌ స్పూన్‌, ధనియాలు - రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, పసుపు - ఒక టీస్పూన్‌, గసగసాలు - రెండు టీస్పూన్లు, తాజా కొబ్బరి తురుము - 175 గ్రాములు.
 
తయారీ విధానం
 
కొబ్బరి గుజ్జు కోసం కావాల్సిన పదార్థాలను మిక్సీ జార్‌లో వేయాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తటి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి.
తరువాత పాన్‌లో ఆవాలు వేసి ఓ మాదిరి మంట మీద వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఇంగువ, కరివేపాకులు వేసి ఓ నిమిషం వేగించాక మామిడి కాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
ఇందులో కొబ్బరి గుజ్జు, బెల్లం తురుము, కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
ఆ తరువాత మంట తగ్గించి ఉప్పు వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. వేడి వేడి అన్నంతో దీన్ని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-03-29T16:19:16+05:30 IST