మామిడి కాయ కూర

ABN , First Publish Date - 2017-03-18T20:53:21+05:30 IST

కావాల్సిన పదార్థాలు ఆవాలు - అర టీస్పూను ,వెల్లుల్లి - 4 రెబ్బలు పసుపు - చిటికెడు, ధనియాలు - 3

మామిడి కాయ కూర

కావాల్సిన పదార్థాలు
ఆవాలు - అర టీస్పూను ,వెల్లుల్లి - 4 రెబ్బలు పసుపు - చిటికెడు, ధనియాలు - 3 టీస్పూన్లు, ఎండుమిర్చి - 3
ఉల్లిపాయ - చిన్నది, కొబ్బరి కోరు - 2 టీస్పూన్లు, పచ్చి మామిడి కాయలు - 4, నూనె - 4 టీస్పూన్లు, నీళ్లు - 1 లేదా 2 కప్పులు, బెల్లం తరుగు - 1 టీస్పూను, ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం
మామిడి కాయలు చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
కొబ్బరి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి, ధనియాలు మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి.
బాండీలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక నూరిన ముద్ద వేసి వేయించాలి.
3 నిమిషాలపాటు వేయించాక గ్రేవీగా తయారయ్యేలా తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు కలపాలి.
ఈ గ్రేవీని 5 నిమిషాలపాటు ఉడికించి మామిడి ముక్కలు వేసి కలపాలి.
బెల్లం తరుగు వేసి ముక్కలు మెత్తబడేవరకూ ఉడికించి దింపేయాలి.

Updated Date - 2017-03-18T20:53:21+05:30 IST