పచ్చి టమోటా కొబ్బరి కూర

ABN , First Publish Date - 2015-12-21T15:19:29+05:30 IST

కావాల్సిన పదార్థాలు: పచ్చిటొమాటో: అరకేజి, శనగపప్పు: అరకప్పు, వేయించిన నువ్వులపొడి: రెండు టీ స్పూన్లు ధనియాలపొడి: ఒక టీ స్పూను, ఎండుకొబ్బరిపొడి: ఒక

పచ్చి టమోటా కొబ్బరి కూర

కావాల్సిన పదార్థాలు: పచ్చిటొమాటో: అరకేజి, శనగపప్పు: అరకప్పు, వేయించిన నువ్వులపొడి: రెండు టీ స్పూన్లు ధనియాలపొడి: ఒక టీ స్పూను, ఎండుకొబ్బరిపొడి: ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు, కారం, పసుపు: తగినంత పోపుగింజలు: ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు,కొత్తిమీర
తయారుచేయు విధానం: గట్టి పచ్చిటొమాట కాయలను కడిగి పెట్టుకోవాలి. శనగపప్పు ఒక గంటసేపు నానబెట్టాలి. నువ్వులను వేయించి పొడ చేసిపెట్టుకోవాలి. గిన్నెలో నూనెపోసి వేడి చేశాక పోపు సామాను వేసి వేగాక కరివేపాకు, ఇంగువ, టమాటముక్కలను వేసి కలపాలి. తరువాత నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ముక్క మెత్తబడగానే వేయించి పొడి చేసుకున్న నువ్వులపొడిని, ధనియాలపొడిని, ఎండుకొబ్బరిపొడిని వేసి కలపాలి. అంతా సమంగా ఉడికాక దింపేముందు కొత్తిమీర వేసి దింపాలి.

Updated Date - 2015-12-21T15:19:29+05:30 IST